
ఇండియన్ ఆర్మీ 145వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ( టి జీ సి) కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనుంది. సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బిఇ , బి టెక్ లేదా ఏం ఎస్సీ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2027 జూలై 1 నాటికి 20-27 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 29 వరకు ఆన్లైన్లో స్వీకరిస్తారు. ఎంపికలో ఎస్ ఎస్ బి ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష ఉంటాయి.