
తుని,జిల్లావాణి ప్రతినిధి: వైసీపీ సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో తన అనుచరులతో కలిసి ఆయన జనసేన కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా యనమల కృష్ణుడితో పాటు ఆయన అనుచరులకు పవన్ కళ్యాణ్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లు సమాచారం. యనమల కృష్ణుడు జనసేనలో చేరడం తుని నియోజకవర్గ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.