
పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ఏజెన్సీ ప్రాంతాల్లోనీ ఆదివాసీ రైతులను ఉద్యాన పంటల సాగువైపు ప్రోత్సహించేందు కు జీడిమామిడి మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు రంపచోడవరం డివిజన్రాజవొమ్మంగి మండల ఏపీవో శ్రీనివాస్ తెలిపారు. జీ రామ్ జీ పథకం ద్వారా మండల పరిధిలోని వాతంగి, లోదొడ్డి, చికిలింత, వంఛంగి, గడువకుర్తి, చెరుకుంపాలెం, లబ్బర్తి తదితర గ్రామాల వారికి 7 వేల జీడిమామిడి మొక్కలను రైతులకు పంపిణీ చేశామని గురువారం పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. రాజవొమ్మంగి మండలంలోని మొత్తం 310 ఎకరాల విస్తీర్ణంగాను ఇప్పటివరకు 21,700 జీడిమామిడి మొక్కలను రైతులకు అందజేసి నట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన రైతులకు జీడిమామిడి సాగు చక్కటి ఆదాయ వనరులమార్గాలనీ ఏపీవో శ్రీనివాస్ స్పష్టం చేశారు. రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉద్యాన పంటల ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొంటూ జీడిమామిడి తోటలను అభివృద్ధి పర్చుకోవాలి రాజవొమ్మంగి ఏపీవో అన్నారు.