Zilla Vaani
ప్రింట్ తేదీ: నవంబర్ 24, 2026, 3:04 మధ్యాహ్నం | ప్రచురణ తేదీ: నవంబర్ 23, 2026, 4:07 మధ్యాహ్నం

కాట్రావులపల్లి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణను ఖండించిన మాజీ మంత్రి తోట నరసింహం

కాకినాడ జిల్లా, జగ్గంపేట : జగ్గంపేట నియోజకవర్గంలోని కాట్రావులపల్లి గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థి గండికోట అరుణ నామినేషన్‌ను అన్యాయంగా తిరస్కరించడాన్ని మాజీ మంత్రి, జగ్గంపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోట నరసింహం తీవ్రంగా ఖండించారు.కాట్రావులపల్లి గ్రామ సర్పంచ్ పదవి బీసీ రిజర్వేషన్‌కు కేటాయించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గండికోట అరుణ నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 21వ తేదీన జరిగిన నామినేషన్ల పరిశీలనలో ఆమె భర్త వీర వెంకటరావు పేరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డులలో స్పష్టంగా ఉన్నప్పటికీ, కుల ధ్రువీకరణ పత్రంలో పేరు దగ్గర ‘వి’ అనే ఒక్క అక్షరం తక్కువగా ఉందనే కారణంతో నామినేషన్‌ను తిరస్కరించారని తోట నరసింహం తెలిపారు.న్యాయం కోసం అప్పీల్ చేసుకునేందుకు వెళ్లినప్పటికీ ఎన్నికల అప్పిలేట్ అధికారి, పెద్దాపురం ఆర్డీవో అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమన్నారు.ఈ విషయంపై అలాగే నియోజకవర్గంలో ఎన్నికల సంబంధిత సమస్యలపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తోట నరసింహం కోరారు.

సేవ్ చేసే ముందు రంగులు మార్చండి