Zilla Vaani
ప్రింట్ తేదీ: నవంబర్ 23, 2026, 1:50 మధ్యాహ్నం | ప్రచురణ తేదీ: నవంబర్ 23, 2026, 11:56 ఉదయం

కోరం లేక వాయిదా పడిన యలమంచిలి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక

ఎలమంచిలి, నవంబర్ 23: ఎలమంచిలి మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా, జనసేన, వైసీపీ కౌన్సిలర్లు హాజరుకాకపోవడంతో కోరం సరిపోలేదు. దీంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్ అధికారి రామలక్ష్మి ప్రకటించారు. మంగళవారం మరోసారి ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని, అప్పటికీ కోరం లేకపోతే ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తామని ఆమె తెలిపారు.

సేవ్ చేసే ముందు రంగులు మార్చండి