Zilla Vaani
ప్రింట్ తేదీ: నవంబర్ 23, 2026, 1:54 మధ్యాహ్నం | ప్రచురణ తేదీ: నవంబర్ 23, 2026, 1:42 మధ్యాహ్నం

కోళ్ల దొంగతనం అనుమానం.. యువకుడిని కొట్టి చంపిన కర్కశులు

కోళ్ల దొంగతనం అనుమానం.. యువకుడిని కొట్టి చంపిన కర్కశులు

తూర్పుగోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం మధురపూడి విమానాశ్రయం సమీపంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కోళ్ల దొంగతనానికి వచ్చాడనే అనుమానంతో ఓ యువకుడిని పట్టుకున్న కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వీరులపాడు మండలం గోకరాజుపల్లెకు చెందిన తిమ్మసత్తి నరేష్ (36) బైక్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య అఖిల, ఇద్దరు పిల్లలతో జీవిస్తున్న నరేష్ గురువారం సాయంత్రం ముగ్గురు స్నేహితులతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.అర్ధరాత్రి దాటిన తర్వాత మధురపూడి విమానాశ్రయం సమీపంలోని ఓ కొబ్బరితోటలోకి వెళ్లిన నలుగురు అక్కడ ఉన్న నాలుగు పందెం కోళ్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన కోళ్ల షెడ్డులో పనిచేసే వ్యక్తులు వారిని వెంబడించగా ముగ్గురు తప్పించుకున్నారు. నరేష్ మాత్రం పట్టుబడ్డాడు.అనంతరం నరేష్‌ను పోలీసులకు అప్పగించకుండా సుమారు ఆరుగురు కలిసి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దుస్తులు తొలగించి, చేతులు వెనక్కి కట్టేసి కర్రలు, రాడ్లతో తీవ్రంగా కొట్టినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రాత్రంతా చలిలో ఆరుబయట నిర్బంధించడంతో పాటు శుక్రవారం కూడా దాడి కొనసాగించినట్లు ఆరోపించారు. భార్య వేడుకున్నా కనికరించలేదు! నరేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మిగిలిన ముగ్గురి వివరాలు చెప్పాలని, వారిని తీసుకొచ్చి అప్పగించకపోతే నరేష్‌ను చంపేస్తామని బెదిరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తనకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, భర్తను విడిచిపెట్టాలని భార్య అఖిల వేడుకున్నా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర గాయాలతో నరేష్ శుక్రవారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎనిమిది మంది పోలీసుల అదుపులో! ఈ ఘటనకు సంబంధించి కోళ్ల షెడ్డు యజమాని బులుసు సురేంద్ర చౌదరితో పాటు మరో ఏడుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. న్యాయం కోసం కుటుంబ సభ్యుల ఆందోళన నరేష్ మృతితో భార్య అఖిల, ఇద్దరు చిన్నారులు దిక్కులేనివారయ్యారు. నిందితులందరినీ కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.దొంగతనం చేశాడనే అనుమానం ఉంటే పోలీసులకు అప్పగించాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సేవ్ చేసే ముందు రంగులు మార్చండి