
పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: గిరిజన రైతుల ఆర్థిక అభ్యున్నతికి వ్యవసాయ యాంత్రీకరణ ఎంతో దోహదపడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. సోమవా రం రంపచోడవరం లోని సిరిగిందలపాడు ఉద్యానవన శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఐటీడీఏ,ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్,జిల్లా హార్టీ కల్చర్ అధికారి దేవదానం, పీహెచ్ఓ నరేంద్ర కుమార్,కె వి కే సైన్సిస్టులు గోవర్ధన్, రాజేంద్రప్రసాద్ లు గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్

కుమార్ మాట్లాడుతూ..పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ వారి ఆధ్వర్యంలో ఉద్యానవన గిరిజన రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకొని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. వ్యవసాయ పనుల్లో శ్రమ, సమయం తగ్గించడంతో పాటు రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేందుకు రాయితీపై యంత్ర పరికరాలను అందించడం జరిగిందని ఆయన తెలిపారు. గిరిజన రైతుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి, యంత్ర పరికరాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని ఆయన సూచించారు. గిరిజన రైతులకు మినీ టిల్లర్లు,తైవాన్ స్ప్రేయర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు వంటి వ్యవసాయ పరికరాలను 90% రాయితీ సబ్సిడీపై అందజేసీనట్లు ఆయన తెలిపారు. పోలవరం జిల్లాలో గిరిజన రైతులకు 32 పవర్ టిల్లర్లు అందించడం జరిగిందని ఒక్కొక్క పవర్ టిల్లర్ ధర 1,24,440 రూపాయలు , ప్రభుత్వం రాయితీ లక్ష రూపాయలు, రైతు కట్టవలసిన వాటా 24,440 రూపాయలు అని ఆయన తెలిపారు. అదేవిధంగా తైవాన్ స్ప్రేయర్లు 300 ఒక్కొక్క యూనిట్ ధర 16,830 రూపాయలు, అదేవిధంగా 15, 147 రూపాయలు రాయితీపై అదేవిధంగా 1683 రూపాయలు రైతులు కట్టవలసి ఉన్నదని ఆయన తెలిపారు. అదేవిధంగా బ్యాటరీ స్ప్రేయర్లు 4000 ఒక్కొక్క యూనిట్ ధర 4,794 రూపాయలని ప్రభుత్వ సబ్సిడీపై 4,314 రూపాయలు, రైతులు కట్టవలసిన వాటా 480 రూపాయలని ఆయన తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వ్యవసాయంలో యాంత్రీ కరణతో కూలీ ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని జేసీ తెలిపారు. ఏజెన్సీలోని ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెంది వారి వారి కుటుంబాలు ఆర్థికంగా బలపడే విధంగా ఈ రాయితీలు సద్వినియోగ పరచుకొని మంచి వ్యవసాయం చేయాలని రైతులను ఆయన కోరారు అదేవిధంగా రానున్న రోజుల్లో రైతులకు ఐటీడీఏ ద్వారా జిల్లా కలెక్టర్ వారి యంత్రాంగం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా మరిన్ని ప్రోత్సాహాలతో వ్యవసాయం కొరకు తోడ్పాటును అందించ డం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం పవర్ టిల్లర్లు లబ్ధిదారులకు పవర్ టిల్లర్ల తాళాలు అందజేసి రిబ్బన్ కట్ చేసి ఏ విధంగా పవర్ టిల్లర్లతో దున్నుచున్నది డెమోను జిల్లా జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. పోలవరం జిల్లాలోని గిరిజన రైతులకు వ్యవసాయ పనుల్లో కూలీల ఖర్చు సమయం మరియు శారీరక శ్రమ తగ్గడంతో పాటు పంటల సంరక్షణ మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా జీడి మామిడి, మామిడి,కూరగాయలు మరియు ఇతర ఉద్యన పంటల సాగులో యాంత్రికరణను ప్రోత్సహించి గిరిజన రైతులు తక్కువ పెట్టుబడితో మెరుగైన ఆదాయం పొందేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సబ్ అసిస్టెంట్లు శేఖర్, బాబు నాగరాజు, నూకరాజు, చిట్టిబాబు, భీమన్న, సత్యనారాయణ, రవిచంద్ర, సౌజన్య, కిరణ్ చంద్, గిరిజన రైతులు, తదితరులు పాల్గొన్నారు.
© 2026 Zilla Vaani — అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.