Zilla Vaani
ప్రింట్ తేదీ: నవంబర్ 23, 2026, 1:50 మధ్యాహ్నం | ప్రచురణ తేదీ: నవంబర్ 23, 2026, 6:33 ఉదయం

నక్కపల్లి లో తక్కువ ధరకు ధరణి రైస్ కౌంటర్ లో నాణ్యమైన బియ్యం

నక్కపల్లి లో తక్కువ ధరకు ధరణి రైస్ కౌంటర్ లో నాణ్యమైన బియ్యం


నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణణ్ ఆదేశాలు మేరకు మండల కేంద్రం లోని ధరణి పేరుతో నాణ్యమైన బియ్యం ప్రజలకు అందించేందుకు రైస్ కౌంటర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా డిప్యూటీ తహసీల్దార్ గణపతి రావు చేతులు మీదుగా రాజా వీధిలో ప్రారంభించి కొనుగోలు చేసిన మొదటి బ్యాగ్ ను వారికి అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బిపిటి బియ్యం కిలో రూ 49 చొప్పున 26కిలోల బ్యాగ్ ను రూ 1,274 లకు విక్రయిస్తున్నమన్నారు.ఒక కుటుంబానికి ఒక బ్యాగ్ చొప్పున ఆధార్ కార్డు కు ప్రామాణికంగా చేసి ఇస్తామన్నారు.మండలం లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేద ప్రజలకు మంచి నాణ్యమైన బియ్యం తక్కువ ధరకు అందించాల్లన్నదే ప్రభుత్వం ముఖ్య ఉద్యేశమన్నారు. ఈ కార్యక్రమం లో ధరణి రైస్ కౌంటర్ యజమానులు, కొత్త సందీప్, మామిడి తాతాజీ, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కక్కిరాల సురేష్, కొత్త శ్రీను, ముద్దా బాబ్జి, కొత్త రాము, నున్న గుప్తా, నరసింహ మూర్తి,కొల్నాటి గాంధీ,పసరకొండ పండు తదితరులు పాల్గొన్నారు.

సేవ్ చేసే ముందు రంగులు మార్చండి