
గొలుగొండ మండలం కొంక సింగి గ్రామంలో కూటమి తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి కసవరాజు శ్రీనును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గొలుగొండ మండలఎంపీపీ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ గ్రామం అభివృద్ధి బాటలో నడవాలంటే మన సర్పంచ్ అభ్యర్థి కసవరాజు శ్రీనును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు మనకు పైన తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మన నియోజకవర్గ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉన్నారు మన రాజ్యసభ ఎంపీ విజయబాబు ఎంపీపీగా నేను ఎంపీటీసీగా భవాని మొత్తం ప్రభుత్వం అంతా మనదే ఉంది కాబట్టి మీరు మన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించినట్లయితే మీ గ్రామంలో ఉన్న డ్రైనేజీ సమస్య ఇంటింటికి కుళాయిలు అలాగే పారిశుద్ధ్యం మొదలగు వాటికి ఎక్కువ మొత్తంలో నిధులు తెచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు కానీ కొందరు సర్పంచ్ అభ్యర్థులు ఏవేవో వాగ్దానాలు చేయడం జరుగుతుందని పంచాయతీ నుండి వచ్చే నిధులతో అది సాధ్యం పడదని మీరందరూ తెలుసుకోవాలని తెలిపారు సర్పంచ్ అభ్యర్థి శ్రీను మాట్లాడుతూ నేను మీ అందరిలో ఒక్కడిని మీ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి గ్రామ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు గ్రామంలో ఉన్నసంక్షేమ కార్యక్రమాలకి ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానని గ్రామంలో ఉన్న పలు సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు నాకు ఒక అవకాశం ఇచ్చి ఓటు వేసి గ్రామ ప్రజలందరూ దీవించాలని కోరారు అలాగే గ్రామంలో పది మంది వార్డు సభ్యులను గెలిపించాలని కోరారు అభివృద్ధి అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎలమంచిలి వరహాలు బాబు సగరపు సత్యనారాయణ కర్రి కృష్ణ పెద్దడ నాగేశ్వరరావు కసవరాజు నాయుడు పరవాడ దొర పాల్గొన్నారు

© 2026 Zilla Vaani — అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.