
పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ పునీత్ వీడియో కాన్ఫరెన్స్రెండవ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పోలవరం జిల్లాలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్, ఎస్పీ కె చక్రవర్తి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు. మంగళవారం విజయవాడ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ పునీత్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని కలెక్టర్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి, జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.*ఎస్ ఈ సి అనిల్ చంద్ పునీత్ దిశా నిర్దేశం పోస్టల్ బ్యాలెట్ల భద్రతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచనలుఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ పునీత్ మాట్లాడుతూ, పోలైన పోస్టల్ బ్యాలెట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సూచనల సంకలనం ప్రకారం అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ అత్యంత భద్రతతో తిరిగి తీసుకురావాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఒకటి, రెండు ఓట్ల తేడాతోనే కాకుండా పది కంటే తక్కువ ఓట్ల తేడాతో కూడా అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణలో ప్రతి దశలోనూ పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహిత ప్రాతిపదికన జరుగుతున్నందున బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థి పేరు లేదా పార్టీ పేరు ఉండదని, కేవలం సీరియల్ నంబర్, గుర్తు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ల పంపిణీ, పోలింగ్, సేకరణ, భద్రపరచడం వంటి అన్ని ప్రక్రియలను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.*తొలి విడత ఎన్నికల ఏర్పాట్లు పూర్తి*జిల్లాలో తొలి విడతలో అడ్డతీగల, దేవీపట్నం, గంగవరం, రాజవొమ్మంగి, రంపచోడవరం ఐదు మండలాల పరిధిలో 91 గ్రామ పంచాయతీలు, 850 పోలింగ్ స్టేషన్లు ఉండగా, ఏకగ్రీవమైన స్థానాలను మినహాయించి 88 గ్రామ

పంచాయతీల్లో 826 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమయ్యామని కలెక్టర్ కె దినేష్ కుమార్ వివరించారు. ఐదు మండలాల్లో సర్వీస్ ఓటర్లతో సహా సుమారు 1,559 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్ ప్రక్రియ పూర్తయిందని, ఓటరు స్లిప్పుల పంపిణీ మంగళవారం సాయంత్రానికి పూర్తి చేస్తామని తెలిపారు.కొండపల్లి (రాజవొమ్మంగి మండలం), వీరవరం (అడ్డతీగల మండలం), జియ్యంపాలెం (గంగవరం మండలం) గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయని, జగన్నాధ పాలెంలో సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైందని వివరించారు. అదేవిధంగా మొత్తం 116 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్, సీసీటీవీ, వీడియోగ్రఫీ ద్వారా నిఘా ఏర్పాటు చేస్తున్నామని, 188 పోలింగ్ స్టేషన్లలో సీసీటీవీ, మిగిలిన కేంద్రాల్లో వీడియోగ్రఫీ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. 41 సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు. పోలింగ్ సిబ్బందికి నియామక ఉత్తర్వులు అందజేశామని, మండలాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు ముందురోజే హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.బ్యాలెట్ పేపర్లతో సహా ఎన్నికల సామగ్రిని సంబంధిత మండలాలకు తరలించామని, రవాణా, పంపిణీ ప్రణాళికలను సిద్ధం చేశామని వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును ఎంసీసీ, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ తదితర బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, అన్ని స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు 24 గంటల పాటు పనిచేస్తున్నాయని తెలిపారు. రెండవ విడత ఎన్నికలకు సన్నాహాలు*రెండవ విడతలో గుర్తేడు, వై.రామవరం, చింతూరు, మారేడుమిల్లి, కూనవరం, వి.ఆర్.పురం, ఏటపాక ఏడు మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి రోజు కాగా, పోలింగ్ సిబ్బందికి నియామక ఉత్తర్వులు ఇప్పటికే అందజేశామన్నా రు. మూడవ విడత ర్యాండమైజేషన్ మాత్రమే పెండింగ్‌లో ఉందని వివరించారు.బ్యాలెట్ పేపర్లు మినహా మిగిలిన ఎన్నికల సామగ్రిని మండలాలకు తరలించామని, బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయిందని, వాటిని మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం మండలాలకు అందజేస్తామని తెలిపారు. ఈ ఏడు మండలాల్లో నవంబర్ 27న షెడ్యూల్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. వాహనాల అవసరం, రవాణా, ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్ ఏర్పాట్లు, సీసీటీవీ, వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్ పర్యవేక్షణకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. రెండవ విడతలో 158 పోలింగ్ స్టేషన్లలో సీసీటీవీ ద్వారా, మిగిలిన కేంద్రాల్లో వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్ ప్రక్రియను చిత్రీకరించనున్నట్లు తెలిపారు. సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని 91 ప్రాంతాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు.*జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు*పోలవరం జిల్లా పరిధిలో రెండు విడతల్లో మొత్తం 12 మండలాల్లో 186 గ్రామ పంచాయతీలు, 1,734 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. మొత్తం 2,78,545 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకో నున్నారని, ఇందుకోసం 1,911 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశామన్నారు. తొలి విడతలో 1,35,562 మంది ఓటర్ల కోసం 924 బ్యాలెట్ బాక్సులు, రెండవ విడతలో 1,42,983 మంది ఓటర్లు, 987 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.జిల్లాలోని మారుమూల, తక్కువ మొబైల్ నెట్వర్క్ సదుపాయం ఉన్న ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 12 మండలాలకు ప్రత్యేక కమ్యూనికేషన్ ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు శాఖ సమన్వయంతో పటిష్ట భద్రతా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. జిల్లా స్థాయిలో 18 మంది నోడల్ అధికారులు, మండల స్థాయిలో 12 మంది నోడల్ అధికారులు, 40 మంది జోనల్ అధికారులు నిరంతరం ఎన్నికల విధులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎంసీసీ, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఆడిట్ బృందాలు అన్ని మండలాల్లో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.*పోలీసు భద్రతపై ఎస్పీ వివరణ*ఎన్నికల సందర్భంగా రెండు విడతల్లోనూ శాంతిభద్రతల పరిరక్షణకు చేపట్టిన చర్యలు, పోలీసు బందోబస్తు, సున్నితమైన మరియు అత్యంత సున్నితమైన పోలింగ్ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు భద్రతా చర్యలు చేపడుతూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు.తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 44 గంటల ముందుగానే ప్రచారం ముగించాల్సి ఉన్నందున, మంగళవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే సంబంధిత సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు తెలియజేయడంతో పాటు, ప్రచార గడువు ముగిసిన అనంతరం ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేసేలా అవసరమైన చర్యలు తీసుకున్నామని, నిబంధనల ఉల్లంఘన జరగకుండా ఎన్నికల పర్యవేక్షణ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని వివరించారు.
© 2026 Zilla Vaani — అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.