Zilla Vaani
ప్రింట్ తేదీ: నవంబర్ 25, 2026, 8:20 మధ్యాహ్నం | ప్రచురణ తేదీ: నవంబర్ 25, 2026, 6:15 మధ్యాహ్నం

బాల్య వివాహాలకు అడ్డుకట్ట: ఐసిడిఎస్ కె. ఉమా

బాల్య వివాహాలకు అడ్డుకట్ట: ఐసిడిఎస్ కె. ఉమా

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: బాల్య వివాహాలను అరికట్టేందుకు ఐసీడీఎస్ అధికారులు చేపడుతున్న చర్యల్లో భాగంగా రంపచోడవరంలో జరగాల్సిన బాల్య వివాహాన్ని అధికారులు ముందస్తుగా గుర్తించి అడ్డుకున్నట్లు. ఈ విషయాన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. ఉమ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రంపచోడ వరం పట్టణ పరిధిలోని ఒక వీధికి చెందిన మైనర్ బాలికకు వివాహం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందిందన్నారు.వెంటనే స్పందించిన ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. ఉమ, సంబంధిత ఐసీడీఎస్ అధికారులు బాలిక ఇంటికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. బాలిక వయస్సు 18 సంవత్సరాలు పూర్తికాకముందే వివాహం నిర్వహిం చడం చట్టరీత్యా నేరమని ఇరు కుటుంబాల తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల వల్ల బాలికల శారీరక, మానసిక ఆరోగ్యంపై కలిగే ప్రతికూల ప్రభావాలు, వారి విద్యాభ్యాసం, భవిష్యత్తుపై పడే దుష్ప్రభావాల గురించి అధికారులు అవగాహన కల్పించారు. బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం ఇటువంటి వివాహాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులకు ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు, శిక్షల గురించి వివరించి ఇరు కుటుంబాల వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అధికారులు కల్పించిన అవగాహనకు స్పందించిన ఇరు కుటుంబాల తల్లిదండ్రులు బాలికకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం జరిపిస్తామని, ప్రస్తుత వివాహ ఏర్పాట్లను నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మరో మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే వివాహం నిర్వహిస్తామని ఇరు కుటుంబాల వారు అంగీకారం తెలిపారు. బాలికల బాల్యాన్ని కాపాడటంతో పాటు వారి విద్య, భవిష్యత్తుకు భరోసా కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ కె. ఉమ పేర్కొన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని, బాల్య వివాహాల నిర్మూలనలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఆమె కోరారు.

సేవ్ చేసే ముందు రంగులు మార్చండి