
పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం జడ్డంగి జాతీయ రహదారి 516 ఇ ముఖద్వారం వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే మండలం లోని లబ్బర్తికి చెందిన మర్రి బుల్లియ్య (55), జాగు శ్రీను అనే మరో వ్యక్తితో కలిసి కాకినాడ జిల్లా కత్తిపూడి వైపు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా జడ్డంగి గ్రామంలో కుక్క ద్విచక్ర వాహనానికి అడ్డురావడంతో తీవ్రంగా గాయపడిన బుల్లియ్యను హుటా హుటిన స్థానిక జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా స్థానిక వైద్యుడు నాగార్జున, స్టాఫ్ నర్స్ నాగలక్ష్మి చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మైదాన ప్రాంతం ఏలేశ్వరం తరలించే లోపే మృతి చెందాడు. మర్రి బుల్లియ్య మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నూరుగా వినిపిస్తున్నారు. ఈక్రమంలో లబ్బర్తి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
© 2026 Zilla Vaani — అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.