
అమరావతి : అసోంలోని భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ జవాను కదిమి వేణు (31) నదిలో మునిగి మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వేణు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విధులు నిర్వహిస్తూ జవాను ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొంటూ.. వేణు కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
© 2026 Zilla Vaani — అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.