
ఘనంగా భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం.
నర్సీపట్నం మున్సిపాలిటీ ఎస్సీ కాలనీలో,ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును పురస్కరించుకొని,భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని,ఎంఆర్పిఎస్ నాయకులు మారుడిపూడి సతీష్, MRPS, MSP అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ముందుగా నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యాంగ ప్రవేశికను చదివి ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగాMRPS నాయకులు సతీష్ గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులపాటు ఎంతో శ్రమించి రాయబడిందని, 26 నవంబర్ 1949న ఆమోదించబడి, 26 జనవరి 1950 నుండి అమలులోనికి వచ్చిందని గుర్తు చేశారు.
రాజ్యాంగం వల్లనే ఈ దేశంలోని ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం, న్యాయం లభించాయని అన్నారు. కులం, మతం, ధనిక,పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు, విద్యా హక్కు, సమాన హక్కులు కల్పించిన గొప్ప గ్రంథం రాజ్యాంగం అని కొనియాడారు.
రాజ్యాంగాన్ని కేవలం పుస్తకంలోనే కాకుండా ఆచరణలో అమలు చేయాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగ
విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడికి బాధ్యత, అని పేర్కొన్నారు. ముఖ్యంగా దళిత గిరిజన, బడుగు బలహీనవర్గాల హక్కులను కాపాడటానికి, రాజ్యాంగమే రక్షణ కవచమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ నాయకుల పేర్లు కంటిపాము డేవిడ్ రాజు. MRPS, సీనియర్ నాయకులు.మారుడిపూడి లోకేష్.మంజేటి లోవరాజు. చిoదాడ కొండలరావు. మారుడిపూడి గోపాలకృష్ణ. కంటిపాము రాజబాబు. మంజేటి ప్రసాద్. అయినవిల్లి దుర్గ తదితరులు పాల్గొన్నారు

© 2026 Zilla Vaani — అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.