Zilla Vaani
ప్రింట్ తేదీ: నవంబర్ 29, 2026, 8:18 మధ్యాహ్నం | ప్రచురణ తేదీ: నవంబర్ 28, 2026, 9:18 ఉదయం

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నికల విధులకు హాజరుకానున్న అధికార యంత్రాంగం

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నికల విధులకు హాజరుకానున్న అధికార యంత్రాంగం

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల విధులకు హాజరుకానున్న అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కును శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. నవంబర్ 29వ తేదీన జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులకు హాజరుకావాల్సిన అధికారు లు, సిబ్బందికి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఎన్నికల విధుల్లో బాధ్యతాయుతంగా పాల్గొంటూనే ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కూడా వినియోగించుకోవడానికి సిబ్బంది ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల విధులకు నియమితులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల విధుల కారణంగా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయలేని సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్ మాట్లాడుతూ, సాయంత్రం 6గంట వరకు అందిన సమాచారం మేరకు 895 మంది ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించు కున్నారని తెలిపారు. ఇంకా కొంతమంది ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు వేచి ఉన్నారని, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఎన్నికల విధులకు వెళ్లే సిబ్బంది తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

సేవ్ చేసే ముందు రంగులు మార్చండి