
ప్రాంతీయ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ పేర్కొన్నారు. గొలుగొండ మండలం సాలిక మల్లవరం పంచాయతీలో ఆయన సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన రాజేష్‌కు స్థానిక మహిళలు హారతులతో, పూలమాలలతో ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో రాజేష్ మాట్లాడుతూ.. కూటమి బలపరిచిన సాలిక మల్లవరం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి మాతే వరహాలమ్మను మంచం గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులతో మండలాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని గుర్తు చేశారు.
రానున్న రోజుల్లో పంచాయతీ మరింత ప్రగతి సాధించాలంటే, ఈ ఎన్నికల్లో కూటమి బలపరిచిన సర్పంచ్ మరియు వార్డు సభ్యుల అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

© 2026 Zilla Vaani — అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.