
కోటనందూరు( జిల్లా వాణి)
నా జీవితం ప్రజలకు అంకితం కోటనందూరు సర్పంచిగా గెలిపించండి ప్రజలకు నిస్వార్ధ సేవ చేసుకుంటాను గత 13 సంవత్సరములుగా ప్రజలకు తన సొంత నిధులతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశానని, ప్రజా దీవెనలే నన్ను సర్పంచ్ గా గెలిపిస్తారని సర్పంచ్ అభ్యర్థి కొరుప్రోలు నాగగిరి గోవర్ధన రావు (కృష్ణ) ఆశాభావం వ్యక్తం చేశారు. కోటనందూరు బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్సిపి వాణిజ్య విభాగం అధ్యక్షుడు వెలగా వెంకటకృష్ణాజి, మాజీ సర్పంచ్ గరిసింగు దొరబాబు, ఎంపీటీసీ చిటికెల వెంకటరమణ, చింతల వెంకటరమణ, కురందాసు రాము, తోలెం విజయరాజు వార్డు అభ్యర్థులతో కలిసి కృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మొదటిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలు హారతులతో స్వాగతం పలుకుతూ నీరాజనాలు సమర్పించారు.ఈ ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలియజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కొరుప్రోలు కృష్ణ మాట్లాడుతూ మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు దాడిశెట్టి రాజా నన్ను బలపరిచి ఎన్నికలలో సర్పంచ్ గా పోటీ చేసే అవకాశం కల్పించారని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ.. గ్రామంలోని ఓటర్ మహాశయలు డిసెంబర్ 2వ తేదీన జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ అభ్యర్థులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, కూటమీ అభ్యర్థులను గెలిపించకపోతే పెన్షన్లు తీసివేసి సంక్షేమ పథకాలు రాకుండా చేస్తామని బెదిరిస్తున్నారని విమర్శించారు. ఎవరు సర్పంచ్ గా గెలిచిన అర్హులైన వారికి సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వమైనా ఇచ్చి తీరుతుందని, పంచాయతీ నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి నేరుగా వస్తాయని, ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టిన ప్రజలు నమ్మవద్దు అని అన్నారు. ప్రజలకు వైఎస్ఆర్సిపి పార్టీ, కాకినాడ జిల్లా అధ్యక్షుడు మన నాయకుడు దాడిశెట్టి రాజా అండగా ఉంటారని విజ్ఞప్తి చేశారు. కోటనందూరు గ్రామం ఓటర్ మహాశయులు డిసెంబర్ 2వ తేదీన జరగబోయే ఎన్నికలలో కత్తిరి గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా మరొక్కసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
© 2026 Zilla Vaani — అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.