
నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
మండలం లోని కాగిత గ్రామం లో ఏపీఐఐసీ ద్వారా ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ రహదారి లో రైతులు ఎగువ ప్రాంతాల్లో ఉన్న తమ భూములకు వెళ్లేందుకు వీలు లేకుండా ఆర్ అండ్ బి అధికారులు రోడ్డుకు డివైడర్(గట్టు ) వేశారు. దీనిపై కాగిత గ్రామానికి చెందిన రైతులందరూ అభ్యన్తరం వ్యక్తం చేస్తూ పూర్వం నుండి తమ భూముల్లోకి వెళ్ళేందుకు రాకపోకలు సాగిస్తున్న గ్రావెల్ రోడ్డుకు ఎదురుగా క్రాసింగ్( యూటర్న్ ) ఏర్పాటు చేయాలని మంగళవారం ఆందోళన చేపట్టారు. ఇప్పటికే వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి, వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో తహసీల్దార్ , ఆర్డీవో లకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రైతులందరూ ఆర్ అండ్ బి, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ రైతులు సమస్య పట్టించు కోకుండా యూటర్న్ ఏర్పాటు చేయకపోవడంతో మంగళవారం వీసం రామకృష్ణ కలిసి రైతులందరూ ఆ ప్రాంతంలో బయటాయించారు. అనంతరం వీసం రామకృష్ణ ఆర్ అండ్ బి అధికారులతో చర్చించి తక్షణమే ఈ ప్రాంతంలో క్రాసింగ్ ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో రైతులుతో కలిసి భారీ ఎత్తున రోడ్డు పనులు అడ్డుకు తీరుతామని హెచ్చరించారు.
