HomeAndhra Pradeshమండల ప్రెసిడెంట్ నేతృత్వంలో జోరుగా ఇంటింటా ప్రచారం

మండల ప్రెసిడెంట్ నేతృత్వంలో జోరుగా ఇంటింటా ప్రచారం

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపూడి పెద్దరాజు నేతృత్వంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ గోడపత్రికలను పట్టుకొని జోరుగా ఇంటింటా తిరిగి తమ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

ఈక్రమంలో శుక్రవారం రాజవొమ్మంగి మండలంలోని చికిలింత, గర్రంగి, ఏబీ కాలనీ, రాజవొమ్మంగి గ్రామలలో డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టినట్లు ఏపీఐఐసీ డైరెక్టర్, రాజవొమ్మంగి మండల తెదేపా అధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు మీడియాకు పత్రిక ద్వారా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్న పెంక్షన్, రేషన్, రైతు భరోసా, తల్లికి వందనం వంటి పథకాలు గురించి వివరించారు. అనంతరం గ్రామాల్లోని సమస్యలు ఏమైనా ఉంటే తమకు తెలిపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ లోత లక్ష్మణరావు, సంకురమయ్య, గంగిరెడ్ల బుజ్జి, వీరబాబు, కనిగిరి శ్రీను, కర్రీ రాజబాబు, పెద్దడా నూకరాజు బూత్ ఇంచార్జిలు టిడిపి సీనియర్ నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular