Wednesday, January 21, 2026
HomeInternationalచిరంజీవి దావోస్ కి ఎందుకు వెళ్లారు?

చిరంజీవి దావోస్ కి ఎందుకు వెళ్లారు?

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొంటుంటారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది దావోస్ కు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఎంపీ టీజీ భరత్, పలువురు అధికారులు…తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు. ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకోకండి…రేవంత్ పక్కన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఉండడమే విశేషం.అవును, దావోస్ లో డబ్ల్యూఈఎఫ్ సదస్సులో చిరు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో తెలంగాణ విజన్ ప్రజెంటేషన్ ను చిరు ఆసక్తిగా తిలకించారు.ఆ తర్వాత రేవంత్, మంత్రులతో కలిసి విందు భోజనం కూడా చేశారు. అయితే, దావోస్ టూర్ కు ఏమాత్రం సంబంధం లేని చిరంజీవి అక్కడకు ఎందుకు వెళ్లారు అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.డిసెంబర్ 2025లో జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’లో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. దీంతో, చిరు తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెడతారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments