HomeUncategorizedశ్రీరాముల వారి ఆలయానికి 40 లక్షలు నిధులు మంజూరు స్పీకర్ అయ్యన్న

శ్రీరాముల వారి ఆలయానికి 40 లక్షలు నిధులు మంజూరు స్పీకర్ అయ్యన్న

గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం గ్రామలో ఎన్నో సంవత్సరాలు గడుస్తున్న శ్రీరాములు వారి ఆలయo లేదు శ్రీరామనవమి వచ్చిందంటే గ్రామస్తులు చాలా ఇబ్బంది పడేవారు. పండగ ఎక్కడ జరుపుకోవాలో అని అనుకునేవారు. అయ్యన్నపాత్రుడు గారు ఎన్నికల ముందు గ్రామానికి వచ్చినప్పుడు స్థానిక టిడిపి కార్యకర్తలు గ్రామ ప్రజలు రామాలయం కావాలని కోరగా అప్పుడు అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. ఎలాగైనా సరే మీ గ్రామానికి రామాలయం ఏర్పాటు చేసుకునేందుకు నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు ఆ ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత శ్రీరాములు వారి ఆలయం నిర్మించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వాణి ట్రస్ట్ నుండి 40 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారు. గుడి కట్టుకునేందుకు ఆ శాంక్షన్ లెటర్ బుధవారం చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు సతీమణి పద్మావతి అమ్మగారు చేతుల మీదగా స్థానిక పంచాయతీ నాయకులకు కార్యకర్తలకు అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ టిడిపి నాయకులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి మా గ్రామానికి శ్రీరాముల గుడి (రామకోలు) లేక చాలా ఇబ్బంది పడేవారు మనీ గ్రామంలో శ్రీరాముల పండగ జరుపుకోవాలీ అంటే గుడి లేక మేము చాలా ఇబ్బంది పడేవారు మనీ అయ్యన్నపాత్రుడు గారు హామీ ఇచ్చిన ప్రకారం గుడి కట్టుకునేందుకు నిధులు మంజూరు చేయించినందుకు అయ్యన్నపాత్రుడు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు, ఎల్లవరం సర్పంచ్ కొల్లు రాంబాబు, టిడిపి మండల ఉపాధ్యక్షులు నాగభూషణ అప్పలనాయుడు, గ్రామ మాజీ సర్పంచ్ బెల్లపు కొండలరావు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ జలుమూరి రాజేష్, లగుడు అప్పలనాయుడు, మాజీ సర్పంచ్ గొడ్డటి రాజబాబు, మాకిరెడ్డి బంగారు బాబు, పొట్ల రాజా, పెట్ల చంటి, గోగేటి అప్పలరాజు, పడాల అప్పారావు, పడాల హరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular