HomeAndhra Pradeshచట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాలుపంచుకుంటే కుటుంబాలు చిన్న బిన్నమవుతాయి: సబ్ ఇన్స్పెక్టర్ చిన్నబాబు

చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాలుపంచుకుంటే కుటుంబాలు చిన్న బిన్నమవుతాయి: సబ్ ఇన్స్పెక్టర్ చిన్నబాబు

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లాలోని రాజవొమ్మంగి మండలం వాతంగి గ్రామ పంచాయతీ కొమరాపురం గ్రామంలో జడ్డంగి పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ చినబాబు స్థానిక గ్రామస్థులతో ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా ముఖాముఖిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి వల్ల వచ్చే అనర్ధాలపై అవగాహనను కల్పించారు. గంజాయి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి అక్రమ సాగు, అమ్మక రవాణాకు పాల్పడటం చట్ట రిత్యా నేరమని సబ్ ఇన్స్పెక్టర్ చిన్నబాబు పేర్కొన్నారు. కాదని గంజాయి వంటివాటితో పట్టుబడి జైలు పాలవడం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతయన్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడైనా గంజాయి రవాణా జరిగితే సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కు గాని, 9440900766, 9440900764 5 ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్ఐ పిలుపునిచ్చారు. సమాచారం అందించే వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని చినబాబు వాపోయారు. అంతేకాకుండా మహిళా చట్టాలు, శక్తి యాప్, రోడ్డు ప్రమాదాల నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈకార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, ఏ. పి. ఎస్. పి. సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular