HomeAndhra Pradeshస్థానిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరు పనిచేయ్యాలి వైఎస్‌ జగన్‌

స్థానిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరు పనిచేయ్యాలి వైఎస్‌ జగన్‌

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా గనుక జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో భేటీ అయిన వైఎస్‌ జగన్‌.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావు. మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం ఓటేస్తారు. అందుకే చంద్రబాబు ఎన్నికలను నిష్పక్షపాతంగా జరగనివ్వరు. స్థానిక ఎన్నికలను నేతలు ఆషామాషీగా తీసుకోవద్దు. బలమైన అభ్యర్థులను నిలబెడదాం. గతంలో.. ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీ చైర్మన్‌, మేయర్‌ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశాం. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలి. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే, రేపు సాధారణ ఎన్నికల్లో అతడు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తాడు’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular