
నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ మెడికల్, హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జాయింట్ అసోసియేషన్ కమిటీ అనకాపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కోరుతూ ఈనెల 21 నుండి దశల వారీగా శాంతి యుత కార్యాచరణ చేపట్టారు. ఈ మేరకు మంగళవారం హోం మంత్రి వంగలపూడి అనితను ఆమె నివాసం వద్ద కలిసి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి న్యాయం చేయాలనీ కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో డి.ఎం.ఈ, డి పి హెచ్ విభాగాలలో అనేక సంవత్సరాలనుండి విధులు నిర్వహిస్తున్న జిల్లా వ్యాప్తంగా సుమారుగా 360 మంది పనిచేయడం జరుగుతుందని వీరు ఎదుర్కొంటున్న పలు సమస్యలుతో పాటు న్యాయపరమైన డిమాండ్ లను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకోని వస్తు ఈ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను ఉద్యోగ భద్రతను, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెగ్యులర్ చేసి వంద శాతం జీతం, మెడికల్ లీవ్, హెల్త్ కార్డు, ట్రాన్సఫర్, చైల్డ్ కేర్ లీవ్ లాంటి సర్వీస్ బెనిఫిట్స్ కల్పించాలని జే ఏ సి తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ సౌమ్య, ఎస్. ఇమామ్, ఎస్. శివ ప్రసాద్ వర్మ, ఈ. జీవన జ్యోతి, జి. వనజ, ఆర్. వరలక్ష్మి, ఎస్. ఉమాదేవి, కె. భవాని, కె. రాము తల్లి, తదితరులు పాల్గొన్నారు.
