HomeUncategorizedపవన్ బాబు మాకు మంచినీళ్లు ఇవ్వండంటూ చేతులు జోడించి వేడుకుంటున్న దళిత గిరిజన పేద మహిళలు.

పవన్ బాబు మాకు మంచినీళ్లు ఇవ్వండంటూ చేతులు జోడించి వేడుకుంటున్న దళిత గిరిజన పేద మహిళలు.

మంచినీళ్లు ఇవ్వండి.. చేతులు జోడించి వేడుకుంటున్నాం!ఫ్లోరైడ్ ప్రభావిత రోలుగుంటలో తాగునీటి కష్టాలు.. ఖాళీ బిందెలతో దళితులు, గిరిజనులు, పేద మహిళల ర్యాలీరోలుగుంట: ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించిన రోలుగుంట మండల కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. సురక్షిత మంచినీటి కోసం దళితులు, గిరిజనులు, పేద మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి ర్యాలీ నిర్వహించారు. తక్షణమే వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేయాలని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.రోలుగుంటతో పాటు నిండుగొండ, కే.నాయుడుపాలెం, కొవ్వూరు, ఎన్.కొత్తూరు, అంట్లపాలెం, రాజుపేట, మునిపెళ్లి, గొల్లపేట గ్రామాలను ప్రభుత్వం ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలుగా గుర్తించింది. సుమారు 23 ఏళ్ల క్రితమే ఈ ప్రాంత ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు రూ.3.50 కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. జానకిరాంపురం వద్ద వరాహ నదిలో మూడు భారీ బోరుబావులు ఏర్పాటు చేసి, రోలుగుంటలో లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మించి పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేశారు.అయితే ప్రస్తుతం ఆ పథకం పూర్తిగా నిరుపయోగంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరాహ నది పరిసరాల్లో ఇసుక తవ్వకాలు, ఇతర కారణాలతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని వారు ఆరోపిస్తున్నారు. దీంతో బోరుబావుల్లో నీరు లేక గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయిందని చెబుతున్నారు.ఇళ్ల వద్ద సొంతంగా బోర్లు వేసుకున్నా నీరు పడకపోవడంతో పలువురు కుటుంబాలు లక్షల రూపాయలు నష్టపోయామని వాపోతున్నారు. కనీసం ఫ్లోరైడ్ నీరు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొనడం దారుణమని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ.6 కోట్ల పథకం ఏమైంది?అమృతధార–జలజీవన్ మిషన్ కింద 2020–21లో సుమారు రూ.6 కోట్ల నిధులు మంజూరయ్యాయని స్థానికులు తెలిపారు. అయితే పనులు చేపట్టకపోవడంతో ఆ నిధులు రద్దయ్యాయని, తిరిగి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు.మరోవైపు పాత పైపులైన్లు పాడైపోవడంతో అప్పుడప్పుడు మరమ్మతులు చేస్తున్నప్పటికీ, శాశ్వతంగా తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేయడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.సిఎస్ ఆర్,డిఎప్ ఎమ్ నిధులు మంచినీటికి కేటాయించాలిరోలుగుంట, నిండుగొండ, కొవ్వూరు రెవెన్యూ పరిధిలో సుమారు 12 నల్లరాయి క్వారీలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. క్వారీలకు అనుమతులు ఇచ్చే సమయంలో గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తామని హామీలు ఇస్తున్నప్పటికీ, వాటి అమలు ఎక్కడా కనిపించడం లేదని ఆరోపించారు.క్వారీల నుంచి వచ్చే సి ఎస్ ఆర్, డి ఎఫ్ ఎమ్ నిధులను రోలుగుంట ప్రాంత మంచినీటి సమస్య పరిష్కారానికి వినియోగించాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.ఈ విషయంపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి జైతో ఫోన్‌లో మాట్లాడగా, వరాహ నదిలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, ప్రస్తుతం నీటి లభ్యత లేదని తెలిపినట్లు స్థానికులు వెల్లడించారు.ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతంగా గుర్తించి 23 సంవత్సరాలు గడిచినా సురక్షిత మంచినీటి కోసం ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే దళిత, గిరిజన, పేద కాలనీలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేసి, శాశ్వత తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే.గోవిందరావు, వి.నూకరత్నం, వి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular