అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామంలో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. కాఫీ రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా సుమారు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించి, ప్లానింగ్‌కు అవసరమైన చర్యలు చేపట్టేందుకు డీసీసీ ఇంజనీరింగ్ విభాగం డీఈ వంశీ, ఏఈ రఘు శెట్టిపాలెంలో స్థల పరిశీలన చేశారు. నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు, ఈ వారంలోనే యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి వస్తే స్థానిక కాఫీ రైతులకు తమ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసుకునే అవకాశం లభించడంతో పాటు, కాఫీ సాగుకు మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.స్థల పరిశీలన కార్యక్రమంలో శెట్టిపాలెం మాజీ సర్పంచ్ అల్లు నాయుడు పాల్గొన్నారు.
