HomeAndhra Pradeshనిర్విరామంగా ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం

నిర్విరామంగా ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజవర్గ శాసన సభ్యురాలు మిరియాల శిరీష దేవి ఆదేశాల మేరకు ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఏపీఐఐసీ డైరెక్టర్ మరియు రాజవొమ్మంగి మండలం తెలుగుదేశం పార్టీ మండల

అధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు అధ్యక్షతన నిర్విరామంగా ప్రచారం జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ కూటమి తిరుగులేని సంక్షేమం అభివృద్ధి ఎలా అందజేస్తుందో కూలంకుశంగా ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధి పొందుతున్న

లబ్ధిదారులను కలిసి పెద్దిరాజు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజవొమ్మంగి మండలం కిమ్మలగడ్డ గ్రామంలో శుక్రవారం ఉదయం స్థానిక గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెక్క లోవరాజు నేతృత్వంలో ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో నిర్వహించారు అంతేకాకుండా గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన వద్దకు తీసుకురావాలని అక్కడ ఉన్న వారిని కోరారు. ఈ కార్యక్రమంలో టెక్ నూకరాజు, వేచం లావరాజు స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular