
పోలవరం జిల్లావాణీ ప్రతినిధి : రాజవామ్మంగి మండలం జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతట్టు గ్రామమైన జి శరభవరంలో జడ్డంగి పోలీసు పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ చినబాబు సారధ్యంలో పలు అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా మత్తు పదార్థాలు గంజాయి నాటు సారా నివారణ, ఆన్లైన్ సైబర్ మోసాలకు గురికాకుండా ఎలా ఉండలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. అంతేకాకుండా రోడ్డు భద్రత నియమాలు , మహిళలపై జరిగే అఘాయిత్యాల నివారణ వంటివి మహిళలపై వేధింపులు జరిగితే వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ చినబాబు సూచించారు. ఇది క్రమంలో నిరంతరం జడ్డంగి పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్నా వాహన తనిఖీ కేంద్రం వద్ద ఎప్పటికప్పుడు వాహనాలను తనిఖీ చేస్తూ రికార్డులు సక్రమంగా లేని వాహనాచోదకులకు చలానా విధిస్తున్నారు.
