Thursday, April 16, 2026
HomeUncategorizedకుశర్లపూడి పెద్దింటమ్మ తల్లి పండుగ వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్...

కుశర్లపూడి పెద్దింటమ్మ తల్లి పండుగ వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు.

పార్టీలకతీతంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా పెద్దింటమ్మ తల్లి పండుగ వాల్ పోస్టర్ ను కుశర్లపూడి కూటమి నాయకులు గ్రామ పెద్దలు పెద్దింటమ్మ తల్లి ఉత్సవ కమిటీ చైర్మన్ కిల్లాడ అప్పల సీతయ్య నాయుడు, సబ్బవరపు పెద్ది నాయుడు, గొల్లు రమణ, గొల్లు గోవింద, గొల్లు నారాయణరావు, గొల్లు రాంబాబు, సమక్షంలో వాల్ పస్టర్ను పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కుసర్లపూడి గ్రామంలో ఆరాధ్య దేవత పెద్దింటమ్మ తల్లి మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఫిబ్రవరి 27నుంచి మార్చి 3 వరకు సాగనున్న ఈ పండుగ వాల్ పోస్టర్‌ను పార్టీలకతీతంగా చోడవరం శాసనసభ్యులు కె.ఎస్.ఎన్.ఎస్.రాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఉత్సవం గ్రామస్తుల ఆరాధనకు కేంద్రంగా నిలిచి, మండలంలోనే ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.పెద్దింటమ్మ తల్లి మహిమగల దేవతగా కుసర్లపూడి గ్రామస్తులకు అపార నమ్మకం. ఈ పండుగలో సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలతో పాటు డాన్స్ బేబీ డాన్సులు, తప్పిడుగుల్లు, స్టేజీ ప్రోగ్రామ్‌లు, సాంఘిక నాటకాలు మొదలైనవి ఆకట్టుకుంటాయి. ఈ అద్భుతోపేత వైభవాన్ని ప్రత్యేకంగా పంచుకోవాలని చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, మరియు మల్లు నాయుడు ను కలిసి గ్రామస్తులు ఆహ్వానించారు.కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పంచాడ చంద్ర, పెద్దింట్లమ్మ తల్లి ఉత్సవ కమిటీ చైర్మన్ కిల్లాడ అప్పల సీతయ్య నాయుడు, సర్పంచ్ మడ్డు అప్పలనాయుడు,గొల్లు రమణ,గొల్లు గోవింద సబ్బవరపు పెద్ది నాయుడు,గొల్లు నారాయణరావు, గొల్లి రాంబాబు,కుసర్లపూడి కూటమి నాయకులు గ్రామ , పెద్దలు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కలిసి ఎమ్మెల్యేను ఘనంగా ఆహ్వానించి, ఆయన చేతుల మీదుగా వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించి, మహోత్సవ వైభవాన్ని అన్ని ప్రాంతాలకు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular