Thursday, April 16, 2026
HomeAndhra Pradeshరాజవొమ్మంగి మండలంలోఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా సోదాలు, అక్రమంగా ఏడు మద్యం సీసాలు కలిగి ఉన్న...

రాజవొమ్మంగి మండలంలోఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా సోదాలు, అక్రమంగా ఏడు మద్యం సీసాలు కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం డివిజనల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ప్రోహిబిషన్ డిప్యూటీ కమిషనర్ అదేశాల మేరకు రాజవొమ్మంగి మండలంలో గురువారం ఉదయం ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీధర్ మెరుపు దాడులు నిర్వహించారు. రాజవొమ్మంగి మండలానికి చెందిన ఓ వ్యక్తి అక్రమంగా ఏడు మద్యం సీసాలను అమ్మకానికి ఉంచడంతో ఆ వ్యక్తిని అదుపులోనికి తీసుకొని తనపై కేసు నమోదు చేసామని ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. అనంతరం ఉర్లాకులపాడు గ్రామంలోని అక్రమ మద్యం అమ్ముతున్నరన్న కోణంలో కొందరి ఇళ్లపై శ్రీధర్ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఏటువంటి అక్రమ మధ్యం సీసాలు లభించకపోవడంతో.. ఎక్సైజ్ శాఖ అధికారులకు ఉన్న విశ్వనీయ సమాచారం మేరకు ఇద్దరు అనుమానితులను గుర్తించి వారిని బైండోవర్ నిమిత్తం రాజవొమ్మంగి తాసిల్దార్ వారి ఎదుట హాజరు పర్చనున్నట్లు ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1.10.2024 నుండి 26.02.2026 వరకు ఎక్సైజ్ పాలసీ మొదలైనప్పటి నాటి నుండి నేటి వరకు రంపచోడవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 129 బెల్ట్ కేసులు నమోదు చేసి, 128 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా 177.26 లీటర్ల మద్యాన్ని అలాగే 11.70 లీటర్ల బీరును స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ కేసులకు సంబంధించి 98 మందిని తహసిల్దార్ ఎదుట హాజరు పరిచి బైండోవర్ చేసినట్లు వాపోయారు. ఈనేపథ్యంలో ఇప్పటి వరకు నూతన ఎక్సైజ్ పాలసీ మొదలైనప్పటినుండి ఏర్పడిన ఏ4 షాపుల నందు 177 సార్లు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి, 22 లిక్కర్ శాంపిల్స్ ను తీయడం జరిగిందన్నారు. ఆలాగే లిక్కర్ శాంపిల్స్ ను కెమికల్ ఎగ్జామినేషన్ కి పంపగా వాటిలో ఎటువంటి కల్తీ జరగనట్టుగా రిపోర్ట్ లు వచ్చాయి అని రంపచోడవరం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ మీడియాకు తెలిపారు. ఇది ఇలా ఉండగా ఇటీవలే కొన్ని పేపర్ లలో బెల్ట్ షాపులకు సంబంధించిన వార్తలు పూర్తిగా అవాస్తవమని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు. రంపచోడవరం ఎక్సెస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా బెల్ట్ షాపులు నిర్వహించుతున్నట్లు గా సమాచారం ఉంటే వెంటనే రంపచోడవరం ఎక్సైజ్ స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రకటన ద్వారా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular