నక్కపల్లి, జిల్లావాణి మండలంలో ఉపమాక గ్రామం గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తం గా వేంచేసియున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి అనుబంద దేవాలయమైన శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని మూసివేయడం జరిగింది.
స్వామివారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవములు ఉన్నప్పటికీ చంద్రగ్రహణ కారణంగా మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని మూసివేసి తిరిగి రాత్రి 8 గంటలకు తెరవడం జరుగుతుందని ఆలయ ప్రధానార్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు చెప్పారు. ఆలయం తెరిచిన తర్వాత శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమం నిర్వహించి తర్వాత వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా డోలా ఉత్సవము /
(అద్దపు సేవ) అనంతరము రథోత్సవము చోర సంవాదము తదుపరి ఆలయంలో లక్ష్మీ సంవాదం నిత్య సేవా కాలములు యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా ఉపమాక వెంకన్న ఆలయం మూసివేత
RELATED ARTICLES
