
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండల పరిధిలో మొదుకూరు,చొప్పళ్ళ, మడికి గ్రామాల్లో పంచాయితీ రాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇంటిపన్ను సకాలంలో చెల్లింపుపై ప్రత్యేక దృష్టి సారించిన ఆలమూరు ఎంపీడీఓ అయిదం రాజు సెలవు దినాల్లోనూ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.
గ్రామాల అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరైన ఇంటిపన్నును సమయానికి చెల్లించడం ప్రతి గృహ యజమాని బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. సెలవు రోజుల్లో కూడా అధికార యంత్రాంగంతో కలిసి ఇంటింటికీ వెళ్లి పన్ను చెల్లింపుల ప్రాధాన్యతను వివరించడం విశేషం.ఇంటిపన్ను సకాలంలో చెల్లించడం ద్వారా గ్రామాల్లో రహదారుల మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, కాలువల శుభ్రత వంటి మౌలిక వసతుల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీడీఓ తెలిపారు. పన్ను బకాయిలు పెరగకుండ ముందుగానే చెల్లించడం వల్ల జరిమానాలు తప్పించుకోవచ్చని కూడా సూచించారు.ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ప్రజల సహకారం అత్యవసరమని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పన్నులు చెల్లించాలని కోరారు. గ్రామాల్లో పారదర్శకంగా వసూళ్లు నిర్వహిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.