తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৪:২৯ পি.এম ప్రచురణ తేదీ: মার্চ ১৪, ২০২৬, ১২:২৩ পি.এম
BREAKING NEWS

అనకాపల్లి జిల్లా.. యలమంచిలి నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలి మున్సిపాలిటీలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం X-Ray యూనిట్ ను ప్రారంభించిన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందుబాటులోకి వచ్చినప్పటి పేద వారి ఆరోగ్యం, పేదవారికందే వైద్యం సదుపాయాలన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో అందించాలనే సదుద్దేశంతో ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉన్నామన్నారు.యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి పరిసర ప్రాంతాల ప్రజలు మరియు జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదాల బారిన పడిన ప్రయాణికులు వస్తుంటారు కనుక ఈ X-Ray Unit ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.