తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৪:৩৮ পি.এম ప్రచురణ తేదీ: মার্চ ২১, ২০২৬, ১১:০০ এ.এম
BREAKING NEWS

అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలి జిల్లా పరిషత్ అతిథి గృహంలో గల ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారంనియోజకవర్గ కూటమి పార్టీల నాయకులతో ఈ నెల 23న నక్కపల్లిలో జరగబోయే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రజలను తీసుకువెళ్లే విషయమై తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర రోడ్డు భవనాలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు,గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే శ్సుందరపు విజయ్ కుమార్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వ ఘనవిజయమని,శంకుస్థాపనకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసమై నియోజకవర్గంలో నాలుగు మండలాల గ్రామాలకు సంబంధించిన ప్రజలకు ఈ శంకుస్థాపన కార్యక్రమం కూటమి ప్రభుత్వ ఘన విజయముగా తెలియజేసి ముఖ్య నాయకులు కార్యకర్తలు వారి వారి గ్రామాల్లో ప్రజలను స్వచ్ఛందంగా శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చేటట్లు మోటివేషన్ చేయాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలియజేశారు… ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలు కూటమి నాయకులు తదిరులు పాల్గొన్నారు…