తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৬:২৬ পি.এম ప్రచురణ తేదీ: এপ্রিল ১০, ২০২৬, ১:৫২ পি.এম
BREAKING NEWS

ఆర్ల శివారు గ్రామాలలో జి ఎఫ్ ఎల్ ఎన్డ్ లైన్ టెస్ట్ సర్వే.

ఆర్ల శివారు గ్రామాలలో జి ఎఫ్ ఎల్ ఎన్డ్ లైన్ టెస్ట్ సర్వే.

రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీకి చెందిన లోసంగి గిరిజన ప్రాంతం మరియు పెద్దగడువు శివారు గ్రామాల్లో జీఎఫ్ఎల్ఎన్ ఎండ్‌లైన్ టెస్టింగ్ నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు సమగ్ర శిక్షా విభాగానికి చెందిన సిఆర్ఎమ్టీలు పూడి వెంకట్రావు, పరవాడ సతీష్ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి విద్యాసామర్థ్యాలను లీప్ యాప్‌లో నమోదు చేశారు.
గత ఏడాది డిసెంబర్‌లో బేస్‌లైన్ పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో, ఇప్పుడు విద్యార్ధుల అభ్యాస స్థాయిలో వచ్చిన మార్పులను పోల్చి ఈ ఎండ్‌లైన్ వివరాలు అప్లోడ్ చేశామని సిఆర్ఎమ్టీలు తెలిపారు.