తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৩:৫৪ পি.এম ప్రచురణ తేదీ: এপ্রিল ১৩, ২০২৬, ২:৫৫ পি.এম
BREAKING NEWS

శ్రీకాకుళం నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్ ఎలమంచిలి స్టేషన్లో ప్రయాణికులకు స్వాగతం పలికినకూటమి నాయకులు

కేంద్ర మంత్రివర్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు సహకారంతో శ్రీకాకుళం నుండి తిరుపతి వరకు హంసఫర్ రైలుకి ఎలమంచిలి రైల్వేస్టేషన్లో మాజీ పార్లమెంటు సభ్యులు పప్పల చలపతిరావు , రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు గారు, ఉత్తరాంధ్ర జన సేన వ్యవహారాలు ఇంచార్జ్ సుందరపు సతీష్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ పిల్లా ర మా కుమారి స్వాగతం పలకడం జరిగింది. అనంతరం మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు ప్రయాణికులకు పూల బొకేతో స్వాగతం చెప్పి, అనంతరం జండా ఊపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు