తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ১০:৫৪ এ.এম ప్రచురణ తేదీ: এপ্রিল ১৫, ২০২৬, ৯:২০ এ.এম
BREAKING NEWS

రోలుగుంట కేజీబీవీలో ఎంపీహెచ్‌డబ్ల్యూ గ్రూప్‌కు అద్భుత ఫలితాలు.

రోలుగుంట కేజీబీవీలో ఎంపీహెచ్‌డబ్ల్యూ గ్రూప్‌కు అద్భుత ఫలితాలు.

రోలుగుంట కేజీబీవీలో ఎంపీహెచ్‌డబ్ల్యూ గ్రూప్‌కు అద్భుత ఫలితాలు
అనకాపల్లి జిల్లా రోలుగుంటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఎంపీహెచ్‌డబ్ల్యూ గ్రూప్ ఇంటర్ పరీక్షల్లో విద్యార్థినులు ప్రతిభ చాటారు. మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైన 44 మందిలో 42 మంది ఉత్తీర్ణులై 96 శాతం పాసు శాతం నమోదు చేశారు. ఇద్దరు మాత్రమే అనుతీర్ణులయ్యారు. ఈ విభాగంలో జె. పవిత్ర 486 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది.
రెండో సంవత్సరం పరీక్షల్లో 33 మంది విద్యార్థినులు హాజరై అందరూ ఉత్తీర్ణులై 100 శాతం ఫలితాన్ని సాధించారు. కె. సౌజన్య 964/1000 మార్కులు సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచింది.ఈ అద్భుత ఫలితాలపై ప్రిన్సిపల్ తులసి సంతోషం వ్యక్తం చేస్తూ, విద్యార్థినుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వమే విజయానికి కారణమని తెలిపారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థినులను అభినందించారు. తమ పిల్లల విజయం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.