తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৭, ২০২৬, ২:০৯ পি.এম ప్రచురణ తేదీ: এপ্রিল ৩০, ২০২৬, ২:১৮ পি.এম
BREAKING NEWS

రోలుగుంటలో ఎరువులు దుకాణాలపై ఆకస్మిత తనిఖీలు. నిబంధనలు ఉల్లంగించినచో చర్యలు తప్పవు.

రోలుగుంటలో ఎరువులు దుకాణాలపై ఆకస్మిత తనిఖీలు. నిబంధనలు ఉల్లంగించినచో చర్యలు తప్పవు.

అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన రోలుగుంటలో ఎరువుల దుకాణాలు, పీఎస్‌ఎస్ కేంద్రాలను మండల టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో ఎమ్మార్వో శివ, ఎంపీడీవో నాగేశ్వరరావు, ఏవో చిరంజీవి, ఎస్‌ఐ రామకృష్ణ పాల్గొన్నారు.
నిబందనలు ఉల్లంఘిస్తూ అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న దుకాణాలపై ఎమ్మార్వో శివ హెచ్చరించారు. రైతులను మోసం చేస్తూ ధరలు పెంచితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనల ప్రకారం ఎరువుల సరఫరా చేయాలని, ధరల నియంత్రణను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు.