
అనకాపల్లి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి.వి. సత్యనారాయణ రోలుగుంట మండల ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలను స్వీకరించారు. శనివారం ఆయన స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో నాగేశ్వరరావుతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తానని, మండల అభివృద్ధికి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.