అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ధర్మవరం-అగ్రహారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో గుదే గీతాన్వితకు…. 582 మార్కులు వచ్చి ధర్మవరం-అగ్రహారం స్కూల్ కి ప్రథమ స్థానంలో నిలవడమే కాకుండా, యస్.రాయవరం మండలంలో తృతీయ స్థానం సంపాదించిన సందర్భంగా చిరు సత్కారం చేయడం జరిగింది.ముందుగా సరస్వతి అమ్మవారికి పూలమాల వేసి తదుపరి గీతాన్విత తల్లిదండ్రులకు మెడలో అమ్మవారి కండువాలు వేసి చిన్నారి గీతాన్వితకు మెడలో దండవేసి, బొకేలు ఇచ్చి, శాలువా కప్పి, సరస్వతీ అమ్మవారి మెమోంటో ఇచ్చి, కొంత నగదు ప్రోత్సాహకంగా అందజేయడం జరిగింది.ఈ శుభ సందర్భంగా అక్కడకి విచ్చేసిన పిల్లలకు మరియు పెద్దలకు స్వీట్స్ మరియు మజ్జిగ ప్యాకేట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు M.N.S.ప్రశాంతి గారు, ధర్మవరం-అగ్రహారం మాజీ ఉప సర్పంచ్ సియ్యాదుల అచ్యుత్ కుమార్(నాని) గారు, బండి నాగేశ్వరరావు గారు, కోరుప్రోలు రమణ గారు, నగిరెడ్డి అప్పారావు గారు, N.S ఉపాధ్యాయులు రాజాన అప్పలనాయుడు గారు, గీతాన్విత తల్లిదండ్రులు గుదే నాగేశ్వరరావు గారి దంపతులు, తుంపాల రాంబాబు, గజివెళ్లి గణేష్, గుదే చిరంజీవి, మైచర్ల అప్పారావు, బంగారు శ్రావణ సంధ్య పాల్గొన్నారు.
