తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৭, ২০২৬, ৩:০৪ পি.এম ప్రచురణ తేదీ: মে ১৬, ২০২৬, ৪:১৪ এ.এম
BREAKING NEWS

నేడు దోనెలపాలెం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్

నేడు దోనెలపాలెం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం నియోజవర్గ శాసన సభ్యురాలు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీష దేవి శనివారం రాజవోమ్మంగి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముందుగా గొబ్బిలిమడుగు గ్రామపంచాయతీ దోనెలపాలెం గ్రామంలోని ప్రభుత్వం అందిస్తున్న గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమంలో 2:30 గంటల సమయంలో పాల్గొని ఆమె చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తారు. తదనంతరం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ధోనిలపాలెం గ్రామంలోని నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఆమె చేతుల మీద ప్రారంభిస్తారు.