తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৬:০৬ পি.এম ప్రచురణ తేదీ: মে ২২, ২০২৬, ১২:২৬ পি.এম
BREAKING NEWS

కిషోరీ వికాసం: ఆర్థిక నిర్వహణపై అవగాహన సదస్సు విజయవంతం… సిడిపిఓ పూర్ణిమ

జగ్గంపేట, కాకినాడ జిల్లా, మే 22: జగ్గంపేట సంత మార్కెట్ వద్ద గల సచివాలయంలో 'కిషోరీ వికాసం' కార్యక్రమంలో భాగంగా బాలికలకు ఆర్థిక నిర్వహణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఐసిడిఎస్, సీడీపీఓ పూర్ణిమ, వెలుగు జగ్గంపేట మండలం ఏపీఎం ఉమామహేశ్వర రావు పాల్గొని ప్రసంగించారు. డబ్బు అనేది జీవితానికి ఒక సాధనం మాత్రమే, అంతిమ లక్ష్యం కాదని వివరించారు. దానిని తెలివిగా, ఆలోచించి ఖర్చు చేయాలని సూచించారు. ఈ రోజు చేసే చిన్న పొదుపు రేపటికి గొప్ప ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. తెలివైన బాలికలు తమ సొమ్ము ఎక్కడికి వెళ్తుందో ఎప్పటికప్పుడు గమనిస్తారని పేర్కొన్నారు. ఖర్చు చేసే ముందు ఒకసారి ఆలోచించడం అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. వేసవి శిక్షణ అనంతరం ప్రతి ఒక్కరూ 'చిన్నారుల బ్యాంకు' లేదా తపాలా కార్యాలయంలో పొదుపు ఖాతా ప్రారంభించాలని కోరారు. వారపు ఖర్చుల ప్రణాళిక తయారు చేసుకోవాలని, రోజువారీ ఖర్చులను చిన్న దినచర్య పుస్తకంలో నమోదు చేసుకోవాలని సూచించారు.