తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ১২:৩৭ পি.এম ప్రచురణ తేదీ: মে ২৪, ২০২৬, ৭:৫৩ এ.এম
BREAKING NEWS

ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే ‘డ్రగ్ డిటెక్షన్’ తనిఖీలు: జగ్గంపేట సీఐ బి.తిరుపతిరావు

జగ్గంపేట, మే 24: సమాజానికి పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడమే లక్ష్యంగా పోలీసులు సరికొత్త తనిఖీలకు శ్రీకారం చుట్టారు. ఇకపై ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే ‘డ్రగ్ డిటెక్షన్’ తనిఖీలు నిర్వహిస్తామని జగ్గంపేట సీఐ బి.తిరుపతిరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు జగ్గంపేట పోలీస్ సర్కిల్ పరిధిలో నిరంతరం ఈ డ్రగ్ డిటెక్షన్ తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు. అందుబాటులో అత్యాధునిక ‘డ్రగ్ టెస్టింగ్ కిట్స్’జగ్గంపేట పోలీస్ స్టేషన్‌లో అత్యాధునిక డ్రగ్ టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నాయని సీఐ తెలిపారు. రోడ్లపై వెళ్లే వాహనదారులు, అలాగే అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులపై ఈ కిట్ల ద్వారా తక్షణమే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఎవరైనా డ్రగ్స్ సేవించి ఉంటే ఈ తనిఖీల్లో సులభంగా దొరికిపోతారని ఆయన పేర్కొన్నారు."డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యం. మత్తు పదార్థాల వాడకం, రవాణా చట్టరీత్యా తీవ్రమైన నేరం. ఈ నిబంధనలను అతిక్రమిస్తే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవు." అని.తిరుపతిరావు, జగ్గంపేట సీఐ యువతకు హితవు.. సరఫరాపై ప్రత్యేక నిఘాయువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, తమ ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచించాలని సీఐ హితవు పలికారు. డ్రగ్స్ సరఫరా మరియు వాడకంపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఉంచిందని భేషజాలకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. డ్రగ్స్ వాడకం లేదా సరఫరాకు సంబంధించి ప్రజలకు ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే ఈ క్రింది నంబర్లకు సంప్రదించాలని సీఐ పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్: 112 నార్కోటిక్ హెల్ప్‌లైన్: 1972సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, ప్రజలు నిర్భయంగా ముందుకు వచ్చి పోలీసులకు సహకరించాలని సీఐ తిరుపతిరావు విజ్ఞప్తి చేశారు.