తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৭, ২০২৬, ১:০৫ এ.এম ప్రచురణ తేదీ: জুন ১০, ২০২৬, ৫:২৫ পি.এম
BREAKING NEWS

రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన చింతకాయల విజయ్ కు అభినందనలు తెలిపిన రామకృష్ణ.

రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన చింతకాయల విజయ్ కు అభినందనలు తెలిపిన రామకృష్ణ.

తెలుగుదేశం పార్టీ ఐటీ విభాగం (ఐటీడీపీ) అధ్యక్షులు, యువ నాయకుడు చింతకాయల విజయ్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం పట్ల అనకాపల్లి జిల్లా రోలుగుంట ఎంపీటీసీ సభ్యుడు సుర్ల రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.చింతకాయల విజయ్ యువతకు ఆదర్శంగా నిలుస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఆయన రాజ్యసభలో ప్రజల సమస్యలను సమర్థంగా ప్రస్తావిస్తారని సుర్ల రామకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు.ఇకపై కూడా పార్టీ బలోపేతానికి, ప్రజాసేవలో విజయ్ మరింత శ్రమించాలని ఆకాంక్షిస్తూ, ఆయనకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.