తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৫:৩২ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ৯, ২০২৬, ৪:৫০ পি.এম
BREAKING NEWS

ప్రకృతి వ్యవసాయంలో విత్తన శుద్ధి పై రైతులకు అవగాహన సదస్సు.

ప్రకృతి వ్యవసాయంలో విత్తన శుద్ధి పై రైతులకు అవగాహన సదస్సు.

రోలుగుంట, జూలై 09:
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో విత్తన శుద్ధిపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 100 శాతం ప్రకృతి వ్యవసాయం అమలవుతున్న ఈ గ్రామంలో రైతులతో కలిసి సామూహికంగా వరి విత్తనాలకు బీజామృతంతో విత్తన శుద్ధి చేపట్టారు.ఈ సందర్భంగా డివిజన్ ఎంటీ వరలక్ష్మి విత్తన శుద్ధి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. పీఎండీఎస్ ) అమలు చేసిన నెల రోజుల అనంతరం ఫీల్డ్ విజిట్ కూడా నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి చిరంజీవి మాట్లాడుతూ, రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఆర్ఏఆర్ఎస్ ) నుండి డాక్టర్ అప్పలస్వామి (షుగర్‌కేన్), డాక్టర్ ఎం. చంద్రశేఖర్ రెడ్డి (ఎకనామిక్స్), డాక్టర్ వి. చంద్రశేఖర్ (పథాలజీ), డాక్టర్ డి. ఉమా మహేశ్వరరావు (ఎక్స్టెన్షన్), మండల వ్యవసాయ అధికారి చిరంజీవి, గ్రామ సర్పంచ్ నూకరాజు, రైతులు, ప్రకృతి వ్యవసాయం సిబ్బంది, డివిజన్ ఇంచార్జి వరలక్ష్మి, యూనిట్ ఇంచార్జి గంగరాజు, ఐసీఆర్‌పీఎస్ సభ్యులు పాల్గొన్నారు.