తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ৪:১২ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ১০, ২০২৬, ৭:৩৬ এ.এম
BREAKING NEWS

బీబీ పట్నం హైస్కూల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థి నాయకుల ఎన్నికలు.

బీబీ పట్నం హైస్కూల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థి నాయకుల ఎన్నికలు.

బి.బి.పట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. విద్యార్థి నాయకుల ఎన్నికల సందర్భంగా పాఠశాల ప్రాంగణం ప్రజాస్వామ్య పండుగలా మారింది. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బీబీ పట్టణంకు చెందిన ఈ పాఠశాలలో విద్యార్థులు ఎంతో ఆసక్తితో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ప్రధానోపాధ్యాయుడు ఎస్‌వీ చంద్రశేఖర్ రావు పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ క్రమబద్ధంగా సాగింది. ఓటింగ్ సమయంలో విద్యార్థుల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. ప్రతి ఒక్కరూ తమ అభిరుచికి అనుగుణంగా నాయకులను ఎన్నుకోవడంలో పాల్గొన్నారు.ఈ ఎన్నికల్లో స్కూల్ పీపుల్ లీడర్ (ఎస్ పిఎల్)గా గంజి లక్ష్మీ ప్రసాద్ విజయం సాధించగా, సెకండ్ (ఎస్ పిఎల్) గా గోడే భవ్య శ్రీ ఎన్నికయ్యారు. విజేతలను సహ విద్యార్థులు అభినందించగా, పాఠశాలలో ఆనంద వాతావరణం నెలకొంది.విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈ విధమైన ఎన్నికలు ఎంతో ఉపయోగకరమని ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను చిన్న వయస్సు నుంచే అలవాటు చేయడం ముఖ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.