తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৬:৫৭ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ১১, ২০২৬, ২:২৬ পি.এম
BREAKING NEWS

ప్రకృతి వ్యవసాయంలో వరి విత్తన గుళికల పై అవగాహన కార్యక్రమం.

ప్రకృతి వ్యవసాయంలో వరి విత్తన గుళికల పై అవగాహన కార్యక్రమం.

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా వరి విత్తనగుళికల తయారీపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమం శరభవరం యూనిట్ పరిధిలోని కొంతలం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వరి విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసి విత్తనగుళికలు తయారు చేసే విధానాన్ని సిబ్బంది ప్రదర్శించారు.ఈ ప్రక్రియలో బంక మట్టి పౌడర్, ఘన జీవామృతం, కట్టెల బూడిద, బీజామృతం కలిపిన నీరు, ప్లాస్టిక్ టబ్ మరియు వరి విత్తనాలను ఉపయోగించి రైతుల సమక్షంలో గుళికలు తయారు చేశారు. విత్తన శుద్ధి వల్ల కలిగే ప్రయోజనాలు, విత్తనగుళికల ప్రాముఖ్యతపై ఎస్ డి ఎ గంగరాజు వివరించారు.భూసారం పెంపు కోసం లైన్ సోయింగ్ పద్ధతిలో 5 వరుసలు వరి, 1 వరుస పెసర, అలాగే మినుములు, బొబ్బర్లు, కంది, తోటకూర, గోంగూర, బెండ వంటి అంతరపంటలను సాగు చేయవచ్చని సూచించారు. అనంతరం రైతులతో పి ఎం డి ఎస్ విధానాన్ని అమలు చేయించారు.ప్రకృతి వ్యవసాయ యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తూ, వరి నారుమడిలో ఘన జీవామృతం వేయడం, ద్రవ జీవామృతాన్ని పిచికారీ చేయాలని సూచించారు. ఈ పద్ధతి చాలా ప్రయోజనకరంగా ఉందని రైతులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, ఎస్ డి యర్ గంగరాజు, ఐ సి ఆర్ పి ఎస్ సాంబమూర్తి, సుజాత, సాయిలక్ష్మి, శివ పాల్గొన్నారు.