
పోలవరం జిల్లావాణి ప్రతినిధి: పోలవరం జిల్లాలోని ఏటపాక నవోదయ విద్యాలయ ఆరవ తరగతి ప్రవేశపరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అర్హులైన విద్యార్థులను పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ మాట్లాడుతూ పోలవరం జిల్లాలో ఏటపాకలో జవహర్ నవోదయ విద్యాలయంలో ఆన్లైన్ ద్వారా ఆరో తరగతి ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరడం జరిగిందని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఫీజులు లేకుండా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఆరో తరగతిలో ప్రవేశానికి ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, నివాస దృవపత్రం, ఫోటోలు, విద్యార్థి సంతకం, తల్లిదండ్రుల సంతకాలు అదేవిధంగా వికలాంగులైనచో వికలాంగ ధ్రువపత్రాలు సమర్పించాలని ఆయన అన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల జూలై 31 వ తారీకు లోపు దరఖాస్తులు సమర్పించుకోవచ్చని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ సంవత్సరం నవంబర్ 28 తారీకు శనివారం ప్రవేశ పరీక్ష ఉంటుందని ఆయన అన్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉండాలని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో అభ్యర్థులకు యన్ వి యస్ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ద్వారా సీట్లు కేటాయించడం జరుగుతుందని ఆయన అన్నారు. పోలవరం జిల్లాలోని విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గడువు తేదీలోపు దరఖాస్తులు సమర్పించుకోవాలని ఆయన తెలిపారు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి మరిన్ని వివరాల కోసం సమీప పాఠశాలలోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఇంచార్జ్ బి. వి. శ్రీనివాస రావు, మండల విద్య శాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని ఆయన అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://navodaya.gov.in వెబ్ సైట్ ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.