తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ১১:১৪ এ.এম ప్రచురణ తేదీ: জুলাই ১২, ২০২৬, ২:৫৪ পি.এম
BREAKING NEWS

యూరియా కొరత లేకుండా చేయడమే ప్రభుత్వ ధ్యేయం, పోలవరం జిల్లాలో 1172 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది: కలెక్టర్ దినేష్ కుమార్

యూరియా కొరత లేకుండా చేయడమే ప్రభుత్వ ధ్యేయం, పోలవరం జిల్లాలో 1172 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది: కలెక్టర్ దినేష్ కుమార్

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: పోలవరం జిల్లాలో ఈ ప్రాంత రైతులకు వరి , కంది,మినుము విత్తనాలతో పాటు యూరియా ఎక్కడికక్కడ ఆర్ ఎస్ కె లలో ఏర్పాటు చేయడం జరిగిందని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం సాయంకాలం స్థానిక జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో రైతులకు ఎక్కడికక్కడ యూరియా, పప్పు విత్తనాలు అందించే విధంగా పాత్రికేయుల సమావేశం కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం జిల్లాలోని 77367 మంది రైతులకు యూరియా, డిఏపి ఏ పి ఏ ఐ యం యస్ యాప్ ద్వారా ఈ జిల్లాలో ఉన్న రైతులకు ఆధార్ అనుసంధానంతో ఓటీపీ ద్వారా యూరియా షాపుల్లో గాని,ఆర్ ఎస్ కె లలో గాని మండల వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా గాని ఎన్ని ఎకరాలలో సాగు చేయుచున్న భూములకు యూరియా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. పోలవరం జిల్లాలో 5459 మెట్రిక్ టన్నుల యూరియా ఈ సార్వ సీజన్ కు అవసరమగు అంచనా తో యూరియా సిద్ధం చేయడం జరిగిందని ఆయన అన్నారు. పోలవరం జిల్లాలో 1172 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. అదేవిధంగా ఈ నెల చివరినాటికి 770 మెట్రిక్ టన్నుల యూరియా ప్రభుత్వం సరఫరా చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న యూరియా ఆగస్టు నెల చివరి నాటికి రైతులకు అవసరాలకు యూరియా సరిపోవచ్చని ఆయన అన్నారు. ఇప్పటివరకు పోలవరం జిల్లాలో ఏ పి ఏ ఐ యం యస్ ద్వారా 776 మంది రైతులకు 137 మెట్రిక్ టన్నుల యూరియా ఆధార్ కార్డు ద్వారా యాప్ ద్వారా సరఫరా చేయడం జరిగిందని ఆయన తెలిపారు. పోలవరం జిల్లాలోని రైతులు ఎవరైనా ఎరువుల షాపు వద్ద గాని, ఆర్.ఎస్.కె వద్దకు వెళ్లినప్పుడు మీ భూమి యాప్ లో లేకపోయినా ఆర్ ఎస్ కె సిబ్బంది మీ యొక్క వివరాలను నమోదు చేసి యూరియా ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ జిల్లాలోని తాతలు, తండ్రులు పేరులలో ఉన్న భూములకు వారి వారసుల పేర్లను నమోదు చేసి యూరియా ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. అదేవిధంగా 10.450 క్వింటాల వరి విత్తనాలు 90 శాతం సబ్సిడీపై రైతులు సరఫరా చేసే విధంగా ఎక్కడికక్కడ ఆర్ ఎస్ కె లలో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. అదేవిధంగా 180 క్వింటాల మినుముల విత్తనాలు అదేవిధంగా 44 క్వింటాలు కంది విత్తనాలు 100% సబ్సిడీపై సరఫరా చేయుటకు విత్తనాలు సిద్ధం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా యూరియా సరఫరా లో ఇబ్బంది కలిగిన వెంటనే సంబంధిత మండల వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాలని ఆయన తెలిపారు. పోలవరం జిల్లాలో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాలైన పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని ఆయన అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఎక్కడికఅక్కడ కొనుగోలు చేసే విధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.