తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ১১:১৮ এ.এম ప్రచురణ తేదీ: জুলাই ১৪, ২০২৬, ২:০২ পি.এম
BREAKING NEWS

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత

అమరావతి, జూలై 14: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.1953లో తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం, 1978లో జనతా పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఎన్.టి. రామారావు, మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన, కాపు సామాజిక వర్గ హక్కులు, రిజర్వేషన్ల కోసం చేసిన ఉద్యమాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు.2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముద్రగడ మృతితో రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక అధ్యాయం ముగిసిందని పలువురు నాయకులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.